వొడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్‌తో.. ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్  ఫ్రీ

‌వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ క‌నెక్ష‌న్ల‌తో అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ఫ్రీగా వ‌స్తోంది.  పోస్ట్‌పెయిడ్ క‌నెక్ష‌న్లు తీసుకున్న‌వారికి ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను ఫ్రీగా అందిస్తుంది.  అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ తీసుకోవాలంటే నెల‌కు 129 రూపాయ‌లు లేదా ఏడాదికి 999 రూపాయ‌లు చెల్లించాలి. అయితే వొడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్ క‌నెక్ష‌న్లు తీసుకున్న‌వారికి దీన్ని ఫ్రీగా అందిస్తోంది.

అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ బెనిఫిట్స్‌
* అమెజాన్ వెబ్‌సైట్‌లో  ఏదైనా వ‌స్తువు కొంటే ఎలాంటి అద‌న‌పు చార్జీ లేకుండా ఒక‌టి, రెండు రోజుల్లోనే వ‌స్తువు  డెలివ‌రీ అవుతుంది.
* అమెజాన్‌లో సేల్ ఆఫ‌ర్లు పెట్టిన‌ప్పుడు మిగిలిన‌వారికంటే ఒక‌టి రెండు రోజుల ముందే ప్రైమ్ మెంబర్ల‌కు అవ‌కాశం ఇస్తుంది.
* అమెజాన్ ప్రైమ్ వీడియోలో లేటెస్ట్ మూవీస్‌, వెబ్‌సిరీస్‌లు ఫ్రీగా చూడొచ్చు.
* అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ఫ్రీగా విన‌వ‌చ్చు.
* అమెజాన్ ప్రైమ్‌లో ఈ బుక్స్ ఫ్రీగా చ‌దువుకోవ‌చ్చు. 
 
అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ఫ్రీగా అందిస్తున్న వొడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్ ప్యాకేజీలు ఇవిగో
 

 1) వొడాఫోన్ ఐడియా 499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
* ఈ ప్లాన్‌లో నెల‌కు 75 జీబీ డేటా, 100 ఎస్ఎంస్‌లు వ‌స్తాయి.
‌* వాడ‌కుండా మిగిలిపోయిన డేటాను త‌ర్వాత నెల‌లో వాడుకోవ‌చ్చు (క్వారీ ఫార్వ‌ర్డ్  చేసుకోవ‌చ్చు)
* అయితే ఈ క్యారీ ఫార్వ‌ర్డ్ డేటా 200 జీబీ దాట‌కూడ‌దు. 


2) వొడాఫోన్ ఐడియా 699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
* ఈ ప్లాన్‌లో నెల‌కు అన్‌లిమిటెడ్ డేటా ఇస్తుంది. 
* 100 ఎస్ఎంస్‌లు వ‌స్తాయి.

3) వొడాఫోన్ ఐడియా 1099 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
* ఈ ప్లాన్‌లో నెల‌కు అన్‌లిమిటెడ్ డేటా ఇస్తుంది. 
* 100 ఎస్ఎంస్‌లు వ‌స్తాయి.
* క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్‌కు ప్ర‌యారిటీ యాక్సెస్ వ‌స్తుంది.  
* కొన్ని  హోట‌ల్సు బుకింగ్‌లో 10% డిస్కౌంట్ కూడా ల‌భిస్తుంది.  

4) వొడాఫోన్ ఐడియా 598 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్
5) వొడాఫోన్ ఐడియా 598 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్
6) వొడాఫోన్ ఐడియా 749 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్
7) వొడాఫోన్ ఐడియా 999 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ల‌కు కూడా ఈ అమెజాన్ ప్రైమ్ ఫ్రీ మెంబ‌ర్‌షిప్ ఆఫ‌ర్ వ‌స్తుంది. 

 

వొడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్‌ వొడాఫోన్ ఐడియా అమెజాన్ ప్రైమ్ ఫ్రీ ఆఫ‌ర్‌ అమెజాన్ ప్రైమ్ ఫ్రీ మెంబ‌ర్‌షిప్‌ Amazon Prime Free Subscription Amazon Prime Free Vodafone Idea Post paid Amazon free offer